Name of Innovation(English): Agriculture drone sprayer
Name of Innovation (Telugu): వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్
Description – Telugu: ప్రస్తుతం రైతులు క్రిమి సంహరక మందులు పిచికారి చేస్తున్న సమయంలో వాటిని పీల్చుకుని అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించడానికి 2019 లో పంట పొలాలలో క్రిమి సంహరక మందులు పిచికారి చేసే 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం గల డ్రోన్ అగ్రికల్చర్ పెస్టిసైడ్ స్ప్రేయర్ డ్రోన్ తయారు చేసాను. ఇది సుమారు మీటరున్నర పరిమాణం, 25 కిలోల బరువు ఉంటుంది .. ఈ డ్రోన్ సహాయం తో కేవలం 5 నుండి 10 నిమిషాలలో ఒక ఎకరానికి మందును పిచికారి చేయవచ్చు దీనిని ఉపయోగించడం వలన 50% వృధా వ్యయం తగ్గించవచ్చు దీనిని సామాన్య రైతులు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ డ్రోన్ ను ప్రయోగాత్మకంగా 1500 వందల ఎకరాలకు పైగా మందులు పిచికారి చేసాను. 2019 హైదరాబాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రురల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రురల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ లో కూడా ప్రదర్శించడం జరిగింది.