Name of Innovation (Telugu): లో కాస్ట్ డ్రమ్ సీడర్
Description – Telugu: రైతులు వరి నాట్లు చేతితో/కూలీలతో వేయకుండా, ఈ డ్రం సీడర్ తో వేసినట్లైతే, విత్తనాలు సమాన దూరాలలో, సమాన పరిమాణం లో పడుతాయి. దీని తయారికి పాత సైకిల్ చక్రాలు రెండు, బెరింగులు రెండు, ఒక కేసింగ్ పైప్, ఇనుప పైపులు హ్యాండిల్ కు వాడాను. సాలుకు, సాలుకు మధ్య దూరం ఒక 10 ఇంచులు వచ్చేలా, మొక్క కు మొక్కకు 10cm ల దూరం వచ్చేలా రంధ్రాలు చేశాను. సన్న బియ్యం కు ఒక సైజు రంధ్రం, దొడ్డు బియ్యం కు చిన్న సైజులో రంధ్రం చేశాను. కెసింగ్ పైపుకు మూత ఉండే రంద్రాలు చేసి, అందులో గింజలను వేసి, మూసివేసి పొలం లో నడపాలి. కేసీంగ్ పైపు లో గింజలు సమానంగా పరుచుకొనుటకు లోపల డమ్మీ లను అమర్చవచ్చు.
దీనికి ఖర్చు కేవలం 2,500 రూపాయలు మాత్రమే అయినది.
దీని ద్వారా దాదాపు ఎకరాకు 6 వేల రూపాయలు మిగులుతుంది.